శ్రీలంక పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ తో ‘త్రీడీ’ సినిమా చూపించేస్తాడు! మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ తో గగన విహారం చేయించేస్తాడు! ప్రస్తుతం.. క్రికెట్ లోకి కొత్తగా భరతనాట్యం స్పిన్నర్ వచ్చేశాడు. క్రికెట్ ఏంటి..? భరతనాట్యం ఏంటి..? అనుకుంటున్నారు. కానీ.. ఇది నిజమండి.. కావాలంటే మీరే చదివేయండి.
క్రికెట్ క్రేజే వేరు!
ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. అందులో కొందరి స్థానం ఎప్పటికీ పదిలమే! కొందరు బ్యాటింగ్ లో తనదైన శైలిలో దంచికొట్టి.. వారి ప్రత్యేకతను చాటుకుంటారు. మన దోనీ లాగన్నమాట! ఇంకొందరు బౌలింగ్ తో చెమటలు పట్టించి చిరస్థాయిగా గుర్తిండిపోతారు. శ్రీలంక బౌలర్ మలింగ లాగన్నమాట!.. ఇప్పుడు ఈ క్రికెట్ ప్రపంచంలో మరో కొత్త తరహా బౌలింగ్ హల్ చల్ చేస్తోంది. అదే భరతనాట్యం డ్యాన్స్. మన యువరాజ్ సింగ్.. ఇన్ స్టా గ్రామ్ లో ఇది ప్రత్యక్షమైంది.
బాల్‌తో భరతనాట్యం..
శ్రీలంక పేసర్ లసిత్ మలింగ మైదానంలో బ్యాట్స్ మెన్స్ కి బౌలింగ్ తో త్రీడీ’ సినిమా చూపించేస్తాడు. అందుకే అతనంటే క్రికెట్ ప్రేమికులతో ఎంతో ఇష్టం. ఈ అభిమానం ఒక్క శ్రీలంకకే పరిమితం కాదు. ప్రపంచంలో ఎంతోమందికి మలింగ స్వీటెస్ట్ బౌలర్. ప్రస్తుతం ఇదే తరహాలో ఆకట్టుకుంటున్నాడు భారత సీమర్ జస్ప్రీత్ బుమ్రా. వీరు బంతి విసిరే విధానం భలే చమత్కారంగా ఉంటూ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. ఇప్పుడు వారిబాటలోనే మరో కొత్త బౌలర్ వినూత్న శైలితో మనముందుకొస్తున్నాడు. అతడు బౌలింగ్ చేసే విధానాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. దానికి భరతనాట్యం స్పిన్ అని పేరు కూడా పెట్టేశాడు.
ఏమంటావ్ భజ్జీ?
యువరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోలో గిరగిరా తిరుగుతూ వేసే బౌలింగ్ భలే ఉంది.అందులో స్పిన్ బౌలింగ్ చేస్తున్న బౌలర్ శైలి భలే ఆకట్టుకుంటుంది. బొంగరంలా తిరుగుతూ అతడు చేసే బౌలింగ్‌కు భరతనాట్యం శైలి స్పిన్ అని పేరు పెట్టాడు యువీ. ఏమంటావ్ హర్భజన్ సింగ్ అని భజ్జీని ప్రశ్నించాడతను. ప్రస్తుతం.. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.