భర్త విజయం ఏ భార్యకు మాత్రం ఆనందంగా ఉండదు. రోహిత్ వంటి ఆటగాడు స్టేడియంలో సెంచరీకి చేరువలో ఉంటే ఏ అభిమాని హృదయం మాత్రం ఆతృతతో ఉప్పొంగదు. అటువంటి ఆకట్టుకునే సన్నివేసమే చెపాక్ లో జరిగే రెండో టెస్టులో చోటుచేసుకుంది. హిట్ మ్యాన్ సెంచరీకి చేరువగా ఉండగా.. ఆయన సతీమణి, అభిమాని రితికా సజ్దె మొహంలో ఆ టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపించింది. రోహిత్ శర్మ శతకం బాదేశాక ఆమె మోము సంతోషంతో విరబూసింది.
అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్..

చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్ పరుగుల వరద పారించాడు. 231 బంతుల్లో 161 పరుగులు చేశాడు. 18 బౌండరీలు 2 సిక్సర్లు బాదేశాడు. జట్టులో మిగతా సహచరులు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో సునాయసంగా శతకం చేసేశాడు. రోహిత్ 97 పరుగుల వద్ద ఉండగా మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్ అతడిని పరీక్షించారు. అలీ వేసిన బంతులను అతడు స్వీప్ చేసే క్రమంలో ఫీల్డర్ల ముంగిట బంతులు గాల్లోకి లేచాయి. దాదాపుగా రోహిత్ ఔటవుతాడేమో అనే పరిస్థితి ఏర్పడింది. బ్రాడ్ వేసిన బంతులు అతడి బ్యాటు అంచును తాకి కీపర్ చేతుల్లో పడుతున్నట్టుగా కనిపించాయి.
రితికా గుండె.. లబ్.. డబ్..
అక్కడే గ్యాలరీలో ఉన్న రోహిత్ సతీమణి రితికా సజ్దెలో ఆందోళన కనిపించింది. హిట్‌మ్యాన్ 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు మాత్రం ఆమె గుండెలయ అదుపుతప్పింది! లబ్..డబ్.. అంటూ వేగంగా కొట్టుకోసాగింది. చేతివేళ్లు బిగపట్టుకొని మరీ మ్యాచ్ చూసింది. ఆమె హృదయస్పందన అత్యంత వేగమైంది. శతకం చేశాక ఫింగర్స్ క్రాస్ చేసే కరతాళధ్వనులు చేస్తూ.. సంతోషాన్ని వ్యక్త పరిచింది. ప్రస్తుతం ఈ చిత్రాలు వైరల్‌గా మారాయి.
Must Read ;- హిట్ మ్యాన్ పవర్ ప్యాక్ సెంచరీ.. తొలిరోజు టీమిండియాదే!











