ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద షిప్బిల్డర్ అయిన HD హ్యుందాయ్ సంస్థను దక్కించుకునేందుకు రెండు రాష్ట్రాల ఇప్పుడు ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది. దాదాపు రూ. 38,000 కోట్ల ($4 బిలియన్ల) విలువైన ఈ ప్రాజెక్ట్‌ను ఏపీకి రప్పించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు నేషనల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
గతంలో తమిళనాడులో తూత్తుకూడిలో షిప్‌యార్డ్ ఏర్పాటు చేసేందుకు హ్యుందాయ్ అగ్రిమెంట్ చేసుకుంది. ఐతే ఈ ఒప్పందంలో ఉన్న లూప్‌హోల్‌ను ఏపీలోని కూటమి ప్రభుత్వం పసిగట్టింది. ఆ MoU కేవలం తమిళనాడు ప్రభుత్వానికి మాత్రమే బైండింగ్‌గా ఉందని, హ్యుందాయ్ సంస్థ మాత్రం ఎప్పుడైనా తప్పుకుని వేరే రాష్ట్రాలతో వెళ్లేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఏపీ లాయర్లు, అధికారులు తేల్చేశారు.
రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేష్.. గత జూన్‌లో సియోల్‌లో హ్యుందాయ్ అధికారులతో భేటీ అయి మాస్టర్ ప్లాన్ ప్రెజెంట్ చేశారు. తూత్తుకూడిలో అన్నీ కొత్తగా కట్టుకోవాల్సి వస్తుందని, కానీ ఏపీలోని కాకినాడ గేట్‌వే పోర్ట్ వద్ద ఏకంగా 1,650 ఎకరాల భూమి, 6 కిలోమీటర్ల సముద్ర తీరం, డీప్-డ్రాఫ్ట్ సౌకర్యాలతో పాటు పర్యావరణ అనుమతులు సైతం రెడీగా ఉన్న ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రా ఉందని వివరించారు. దీంతో లోకేష్ ఆలోచనకు హ్యుందాయ్ అధికారులు ఫిదా అయ్యారు.
తమిళనాడులో రాజకీయంగా పరిస్థితులు మారిన వేళ, విజయ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఓ వైపు, ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రెడీమేడ్ ఆఫర్లపై ఇప్పుడు కొరియన్ దిగ్గజం తీవ్రంగా యోచిస్తోంది. అన్నీ సిద్ధంగా ఉన్న కాకినాడ వైపు హ్యుందాయ్ అడుగులు వేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.











