మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర బట్టబయలైంది. బెంగళూరు డాక్టర్ రవిప్రకాశ్ కిడ్నాప్ వ్యవహారమంతా వైసీపీ రాజకీయ కుట్రలో భాగమేనని తేలిపోయింది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. వైసీపీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఖండించారు.
డాక్టర్ రవిప్రకాశ్‌తో తన భూ లావాదేవీలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని స్పష్టం చేసిన సుధాకర్ యాదవ్..2021లోనే తాను ఆ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. అయితే, ఐదేళ్ల తర్వాత ఆ సేల్‌డీడ్‌ను రద్దు చేయాలని వారు కోర్టును ఆశ్రయించగా పిటిషన్ కొట్టివేసిందని, ప్రస్తుతం ఆ వ్యవహారం అప్పీలు రూపంలో కోర్టులోనే తేలాల్సి ఉందని గుర్తుచేశారు.
మైదుకూరులో నమోదైన కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారని, ఐదో నిందితుడైన రవిప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటే దానిని తనకు ఆపాదించి కిడ్నాప్ డ్రామాగా వైసీపీ ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. తనను భయభ్రాంతులకు గురిచేసేందుకే తన మేనేజర్ మురళీమోహన్‌పై హ*త్యాయత్నం చేశారని, ఈ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
తనపై రాజకీయ కక్షతో పెట్టిన ఈ కిడ్నాప్ కేసుపై న్యాయపోరాటం చేస్తానన్నారు సుధాకర్ యాదవ్. ఈ అక్రమ కేసును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించగా ఇప్పటికే స్టే లభించిందని, వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో తిప్పికొడతామని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు.











