పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ టాలీవుడ్ లోనే కాదు.. ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. రాధేశ్యామ్ సినిమా తర్వాత బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సలార్ మూవీ, ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ చేయనున్నారు.
ఈ మూవీ తర్వాత ప్రభాస్ 25వ చిత్రం స్పిరిట్ సెట్స్ పైకి రానుంది. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్నారు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్.. మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ తో మారుతికి మంచి అనుబంధం ఉంది. యు.వి. క్రియేషన్ అంటే ప్రభాస్.. అతని స్నేహితుల నిర్మాణ సంస్థ. అందుచేత ప్రభాస్ తో మారుతి సినిమా అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇది నిజమా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది.
ఇక ఈ వార్త గురించి మారుతినే అడిగితే.. ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడికి ఉంటుంది. నాకు కూడా ప్రభాస్ తో సినిమా చేయాలని ఉంది. అయితే.. నేను హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు రాయను. కథను రాసిన తర్వాత ఆ కథకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే.. వాళ్లతో చేస్తాను. నేను రాసిన కథ ప్రభాస్ కి బాగుంటుంది అనిపించినప్పుడు ఖచ్చితంగా ప్రభాస్ కి కథ చెబుతాను. అయితే.. ప్రస్తుతం ప్రభాస్ తో నేను సినిమా చేస్తున్నాను అని ప్రచారంలో ఉన్న వార్త మాత్రం వాస్తవం కాదు అని క్లారిటీ ఇచ్చారు మారుతి. అదీ.. సంగతి.
Must Read ;- ‘ఆదిపురుష్’ అదిరిపోయే అప్ డేట్











