యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీ్‌శ్వరులు అంటూ బుల్లితెర పై సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ రియాల్టీ షోకు ఊహించిన దానికంటే ఎక్కువుగానే స్పందన లభించింది. మధ్యతరగతి వారి కలలను సాకారం చేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ గేమ్ షోలో తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సందడి చేశారు. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు ఫుల్ జోష్‌గా సమాధానాలు ఇచ్చారు.
ఎన్టీఆర్, మహేష్ కలిసి షో చేస్తే ఇక అభిమానులకు పండగే పండగ. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొన్నారనే విషయం బయటకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ ను ప్రసారం చేస్తారా అని అటు నందమూరి అభిమానులు ఇటు ఘట్టమనేని అభిమానులు ఆతృతగా ఎదురు చేస్తున్నారు. అయితే.. ఈ రోజు దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఓ స్పెషల్ పోస్టర్‌ని నెట్టింట్లో షేర్ చేసింది. పూనకాల ఎపిసోడ్ లోడింగ్ అని పేర్కొంది. దీంతో ఈ స్పెషల్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ గేమ్ షోలో ఇప్పటి వరకూ రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, తమన్, దేవిశ్రీప్రసాద్, సమంత.. ఇలా పలువురు స్టార్ సెలబ్రిటీలు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో గెలుచుకున్న మొత్తాన్ని వాళ్లందరూ ఏదో ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళం అందించారు. ఈ క్రమంలో మహేష్ తో చేసిన ఎపిసోడ్ ప్రసారం కానున్న తరుణంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. మరి.. ఈ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
Must Read ;- రిలీజ్ లోనూ ట్రిపుల్ ఆర్ కొత్త రికార్డు











