‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు మెగా హీరో సాయిధరమ్ తేజ. ఈ సినిమా తెచ్చిపెట్టిన విజయోత్సాహంతో ప్రస్తుతం పలు ఆసక్తికరమైన సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన సాయి చిత్రాల లిస్ట్ లో దేవకట్టా సినిమా కూడా ఉంది. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్స్ లో దేవ ఒకడు. ‘ప్రస్థానం’ తర్వాత ఆ స్థాయిలో మరో సక్సెస్ సాధించలేకపోయినప్పటికీ.. ఆయన దర్వకత్వం మీద చాలా మంది హీరోలకు గట్టి నమ్మకముంది. అందులో భాగంగానే సాయిధరమ్ తేజ దేవకట్టాతో సినిమాకు కమిట్ అయ్యాడు.
‘రిపబ్లిక్’ అనే వర్కింగ్ టైటిల్ తో అతి త్వరలోనే సెట్స్ మీదుకు వెళ్ళనున్న ఈ సినిమా స్టోరీ లైన్ .. మంచికి, చెడుకి పోరాటం అని తెలుస్తోంది. దీని ప్రకారం ఈ సినిమాలోని క్లైమాక్స్ చాలా అసాధారణంగా ఉంటుందట. అసలు ఆ క్లైమాక్స్ ను ఎవరూ ఊహించలేరట. సాధారణంగా చెడు పై మంచి గెలుస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ పాయింట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. గతంలో సాయిధరమ్ తేజ ఎప్పుడూ చేయని ఒక వైవిధ్యమైన పాత్రను ఇందులో చేయబోతున్నాడు. దాని ప్రకారం ఇందులోని అతడి మేకోవర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. మరి ఈ సినిమా సాయిధరమ్ తేజకి, దేవకట్టాకి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.











