మెగాస్టార్ చిరంజీవి మరో మల్టీ స్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఆచార్య అనుకున్న సక్సెస్ ఇవ్వలేకపోవడంతో ఈసారైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు.గతంలో తమిళ సినిమా రీమేక్ గా వచ్చిన ఖైదీ నెంబర్ 150 లానే మరో రీమేక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించాలని చిరు ఆలోచిస్తున్నారట. దాని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం.
ఆచార్య తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరు నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్”.మలయాళంలో మోహన్ లాల్ కి మంచి పేరు తెచ్చిపెట్టిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ ఇది. కాగా, ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటించబోతున్నారట. మూవీలో సల్మాన్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని టాక్. ఇక చిరూ, సల్మాన్ లపై ఒక ప్రత్యేక పాటను చిత్రీకరించడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారట. ఈ పాటని ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరొందిన ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారట. ప్రభుదేవాకి ఇద్దరితోనూ కలిసి పనిచేసిన అనుభవం ఉంది.ఇక ఇద్దరి బాడీ లాంగ్వేజ్ లు ఆయనకి బాగా తెలుసు.ఈ క్రమంలోనే ఈ సాంగ్ ను మూవీ హైలైట్స్ లో ఒకటిగా నిలిపే ఆలోచనలో దర్శకుడు మోహన్ రాజా ఉన్నారని టాక్.కాగా ప్రభుదేవా కూడా తన వైపు నుంచి గట్టిగానే కసరత్తు చేశాడని సమాచారం.
ఇక మూవీలో నయనతార కీలక పాత్ర పోషిస్తుండగా, పూరి జగన్నాథ్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడట.ఇక త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం.మరి టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.