రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హిందూపురం ఎమ్మెల్యే, నటరత్న నందమూరి బాలకృష్ణ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో వీడియోని పోస్ట్ చేశారు. మత గురువు అయిన మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనురిస్తూ ముప్పై రోజులు కఠోర ఉపావాస దీక్షను ముస్లిం సోదారుక అకుంటిత దీక్షకు నా సలాం అంటూ బాలయ్య తనదైన శైలిలో విషెస్ చెప్పారు.
ఒక వైపు ఆధ్యాత్మికత, మరవైపు సర్వ మానవ సమానత్వం, సేవా భావం.. ఇవన్నీ చాటి చెప్పేదే రంజాన్ అని బాలయ్య పేర్కొన్నారు. అదే సమయంలో ఈ రంజన్ పర్వదినం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మనకు మంచి భవిష్యత్తు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని బాలకృష్ణ అన్నారు.