ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ పోరాటం ప్రారంభించింది. “బాదుడే బాదుడు” అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి విస్తృతం ప్రచారం చేయాలని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న పన్నుల భారం, ఆర్ధిక అక్రమాలు,విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ కోటలు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల ఇలా అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి జగన్ పాలనా వైఫ్యల్యాలను ఎండగట్టేందుకు టిడిపి సిద్ధమయ్యింది.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న నేపధ్యంలో తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం సర్వసన్నద్ధం అయ్యింది.ఇప్పటివరకు నయోజకవర్గాల ఇంచార్జ్ ల ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా.. ఇప్పుడు నేరుగా పార్టీ అధినేత రంగంలోకి దిగనున్నారు.
మొదటగా ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా చంద్రబాబు మొదటగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలోని దళ్లవలసలో “బాదుడే బాదుడు” కార్యక్రమంలో పాల్గొననున్నారు. జగన్ పాలనలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు “బాదుడే బాదుడు” నినాదంతో ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.
ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చాక పెరిగిన విద్యుత్ ఛార్జీలు ప్రజలకు మోయలేని భారంగా మారాయి.ఇక ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను,రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ , డీజిల్ ధరలు, నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల జరుతున్న ఈ అనర్ధాలను “బాదుడే బాదుడు” కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని చైతన్య పరచాలని టిడిపి నాయకత్వం నిర్ణయించకుంది.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు స్థానిక నేతలతో కలిసి జగన్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసే గ్రామ సభల్లో బాబు పాల్గొంటారు. ప్రజలతో మమేకమైన తర్వాత సహాపంతి భోజనాల్లో కూడా చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపధ్యంలోనే అధినేత ఆధ్వర్యంలో ఈ కార్యమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజల్లో భారవసా కల్పించడంతో పాటు , క్యాడర్ లోనూ నూతనోత్సాహం నింపవచ్చని టిడిపి నేతలు భావిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత బాబు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయడం ఇదే తొలిసారి. ఇక మహానాడు వరకు బాబు పర్యటనలకు కొనసాగుతుండడంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని నేతలు పట్టుదలతో ఉన్నారు. అదేసమయంలో అధినేత చంద్రబాబు పర్యటనలకు సంబంధించి పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేస్తున్నారు.
మొత్తం మీద పోరాటాల పురిటిగడ్డ నుంచి ప్రారంభం కానున్న బాదుడే బాదుడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో నిర్వహించి..ప్రజా భాగస్వామ్యం, ప్రజా చైతన్యం ద్వారా జగన్ నిర్భంద పాలనకు చెరమగీతం పాడేందుకు టిడిపి నాయకత్వం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది.