మీరు మనుషులా .. సైకోలా?
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం ప్రజలను తీవ్ర కలతకు గురిచేస్తోంది. సందర్శకులు దర్శనార్థం గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో ఉంచారు. ఈక్రమంలో ప్రముఖులు మంత్రి భౌతికకాయాన్ని సందర్శంచి, నివాళులర్పించారు. అయితే మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యు వంశీ మాత్రం అక్కడ మాట్లాడుతూ కనింపించారు. వీరిద్దరూ జోకులు వేసుకుని, నవ్వుకోవడం మిగతా వారికి కోపం తెప్పించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తన ఆగ్రహన్ని ట్విట్టర్ వేదికగా నిలదీశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. హవ్వా.. మంత్రి భౌతికకాయం వద్ద నవ్వాలా..? అంటూ అయ్యన్న ప్రశ్నించారు. సంబంధింత వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి మండిపడ్డారు. తమ సహచర మంత్రి శవం ఉండగా మరో మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ వెకిలి జోకులు వేసుకుంటున్నారని ఆరోపించారు. చిన్న వయస్సులో హఠాత్తుగా చనిపోయాడనే బాధ ఏ మాత్రం లేకుండా ఎలా నవ్వుకుంటూ ఉన్నారో చూడండి అంటూ అయ్యన్న ఆ వీడియోను నెటిజన్లకు షేర్ చేశారు. అంతేకాక ఇలాంటి వారిని ఏమనాలని మండిపడ్డారు. ఏ మాత్రం బాధ లేకుండా ఇలా నవ్వడం ఏంటీ అని తప్పుపట్టారు. బాధ్యయుతమైన పదవీలో ఉండి, ఇలా చేయడం భావ్యం కాదని చెప్పారు. ఇలా చేస్తే.. మిగతా వారికి ఎలాంటి సంకేతాలు వెళ్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read:-కొడాలి నాని చూస్తుంటే చీదర పుడుతుంది