రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూశారనే విషయం నమ్మశక్యం కాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ లోని మంత్రి గౌతమ్ రెడ్డి నివాసంలో ఆయన భౌతికకాయానికి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణం బాధ కలిగించిందన్న పవన్ కళ్యాణ్, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. విద్యావంతుడైన గౌతమ్ తమ ప్రాంతానికి సేవలు అందించాలనే మంచి దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చారని జనసేనాని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డిని కలిసి ఆయనకు వారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...