హైదరాబాద్ భారీ వర్షాలు నగరవాసులను తీవ్ర ఇబ్బందుల్లో నెట్టివేసిన విషయం తెలిసిందే. అప్పుడు కురిసిన వర్షాలతో ఇప్పటికీ కొన్ని కాలనీలు ఇంకా పూర్తిగా కోలుకునేలేదు. హైదరాబాద్ నగరంలోని నాగోల్ పరిధిలోని బృందావన కాలనీలో ఇంకా వరద ప్రభావాన్ని అక్కడి ప్రజలు ఎదుర్కొంటునే ఉన్నారు. రోజుల తరబడి వరద నీరు నిల్వ, రోడ్లపై మురుగు నీరు ప్రవాహంతో రోడ్లపై నాచు ఏర్పడింది. దీంతో రోడ్లపై ద్విచక్రవాహనాల్లో వెళ్తున్నవారు జారి కిందపడుతున్నారని స్థానికులు ట్విట్టర్లో మంత్రి కేటీఆర్కు ఈనెల 27న ఫిర్యాదు చేశారు. అయితే తమ సమస్య మాత్రం ఇంకా పూర్తిగా తీరలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాచు ఉన్న రోడ్లపై వెళ్తూ బైకులపై నుంచి జారి కింద పడి పలువురికి గాయాలు కూడా అయ్యాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
డ్రైనేజీ నీరు, వరద నీరుతో రోడ్లపై నాచు ఏర్పడింది. భారీ వర్షాల వల్ల డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని ట్విట్టర్లో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని వారు మంత్రికి వేడుకున్నారు. నగరంలోని ఇంకా కొన్ని కాలనీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వరద కారణంగా రోడ్లపై బురద, రోడ్లు పాడై, డ్రైనేజీ పొంగిపొర్లుతున్న దృశ్యాలు ఇంకా మనకు కనిపిస్తునే ఉన్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు.
Hi sir @KTRTRS thanks for the CC road and reaction but there is another issue with the road also as water is continuously flowing from above colonies after the heavy rains due to that many bikes are skidding and people are falling down and facing too much problem. https://t.co/jaB0swqpWG pic.twitter.com/i0acUVWLMA
— Pranay Reddy (@mittupanni) October 27, 2020