ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే సీఎం కేసీఆర్ సాగర్ లో అడుగు పెట్టాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన పలు మండలాల్లో, గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రకారం పది శాతం రిజర్వేషన్ల పెంపు జీవో ఇచ్చాకే సాగర్ లో సభ పెట్టాలని, లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఓట్లు వేస్తేనే రైతు బంధు, పింఛన్లు ఇస్తామని అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ప్రతిఒక్కరిదీ అని ఆయన అన్నారు. సాగర్ ప్రజలు జానారెడ్డి పక్షాన నిలబడి, కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా నాగార్జున సాగర్ పరిధిలో ఎక్కడా చూసిన తాను చేసిన డెవలప్ మెంట్ పనులే నేటికీ కనిపిస్తున్నాయన్నారు.
Must Read ;- జానారెడ్డి సీనియార్టీ VS కేసీఆర్ ఇమేజ్ VS మోదీ ఇమేజ్.. సాగర్‌లో పేలుతున్న విమర్శల తూటాలు