నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 14న హాలియాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సభను విజయంతంచేసేందుకు సభ పనుల్లో మునిగిపోయారు. పెద్ద ఎత్తున సభ నిర్వహించాలనుకున్న కేసీఆర్ కు రైతుల రూపంలో గట్టి షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ సభపై స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని పిటిషన్ దాఖలు చేశారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, లక్ష మందితో సీఎం కేసీఆర్ ఎలా సభ నిర్వహిస్తారని రైతులు పిటిషన్ లో పేర్కొన్నారు. ఇటు రైతుల పిటిషన్, అటు కరోనా కేసులు పెరుగుతుండటంతో సీఎం సభ జరగడం ప్రశ్నార్థకంగా మారింది.
Must Read ;- మాయమాటలు చెప్పే కేసీఆర్ ను నమ్ముతారా? : ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్