Chandrababu Naidu Wishes Happy Ugadi To Telugu People
మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంటిల్లిపాదికీ సుఖ సంతోషాలను పంచాలని, తలపెట్టిన పనులన్నీ విజయవంతం కావాలని ఆయన కోరారు. చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఈ సృష్టి ఆరంభమైందని ఆ రోజునే మనం ఉగాదిగా పాటిస్తున్నామన్నారు. మన తెలుగువారికి ఉగాదే నూతన సంవత్సరమని చెప్పారు. ప్రజలందరికీ కరోనా రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆయురాగ్యాలతో సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Must Read ;- తిరుపతిలో బాబుపై రాయి… నడిరోడ్డుపై టీడీపీ అధినేత నిరసన