పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకోనున్నట్లు సమాచారం. వివిధ నివేదికల ప్రకారం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు, పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా నుండి విడిపోయారు అని, అందుకే వేరు వేరుగా ఉంటున్నారని సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నారు కొందరు. పవన్ కళ్యాణ్‌తో పదేళ్ల వైవాహిక జీవితాన్ని ముగించుకుని అన్న లెజినోవా, తన పిల్లలతో రష్యాకు తిరిగి వెళ్లారని, అయితే ఈ పుకార్లపై పవన్ కళ్యాణ్ కానీ, అన్నా కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
అయితే పవన్ కళ్యాణ్ కుటుంబ కార్యక్రమాలకు అన్నా గైర్హాజరు కావడంతో బ్రేకప్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్, 2011లో వచ్చిన తీన్ మార్ చిత్రం షూటింగ్ సమయంలో రష్యన్ మోడల్ మరియు నటి అన్నా లెష్నేవాను కలిశారు. ఇద్దరూ సెప్టెంబర్ 30, 2013న వివాహం చేసుకున్నారు. అన్నాకు గతంలో వివాహం జరిగింది మరియు ఒక కుమార్తె ఉంది. 2017లో పవన్ కళ్యాణ్, అన్న దంపతులకు ఓ కొడుకు పుట్టాడు.
అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ ఇమేజీని డ్యామేజ్ చేయడం కోసమే వైసీపీ నాయకుల ఈ దారి ఎంచుకున్నారు సమాచారం, వైసీపీ నాయకులే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద, ఆయన భార్య మీద దుమ్మెత్తి పోస్తున్నారు. విడాకుల మీద స్పందించిన పవన్ కళ్యాణ్ వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా అరాచకాన్ని చెప్పుతో కొడతాను అని ఆవేశంతో ఊగిపోయారు.











