ఏపీ బీజేపీలో జగన్ బ్యాచ్‌కి పురంధేశ్వరి చెక్ పెట్టనున్నారా..?? సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణు వర్ధన్‌రెడ్డి లాంటి నేతలు ఏం చేయబోతున్నారు..??
ఎన్నికల వ్యూహంలో భాగంగా పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మారుస్తూ భారతీయ జనతా పార్టీ మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు కొత్త చీఫ్‌గా జి.కిషన్‌రెడ్డిని, ఆంధ్రప్రదేశ్‌కి కొత్త చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. అలాగే.. బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిని కూడా తీసుకున్నారు.
కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, షెకావత్‌లతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా భేటీ అనంతరం పలువురు రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు. అలాగే.. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కద్ను ప్రకటించారు. గతేడాది మేలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు. పంజాబ్‌లో జాతీయత, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకే తాను పార్టీ మారినట్లు అప్పట్లో ప్రకటించారు.
ఇదంతా బాగానే ఉంది అయితే ఆంధ్ర ప్రదేశ్‌లోనే బీజేపీ కొత్త అధ్యక్షులుగా పురేందేశ్వరిని నియమించడమే ఇపుడు వైసీపీ నాయకులకి, బీజేపీలోనే ఉంటూ వైసీపీకి వత్తాసు పలుకుతున్న పలువు బీజేపీ నాయకులకు మింగుడు పడటం లేదు. ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పురేందేశ్వరు బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణు వర్ధన్‌రెడ్డి లాంటి నేతలు ఏం చేయబోతున్నారు? ఇన్నాళ్లు ఈ నాయకులు వైసీపీ కి కొమ్ము కాసారని, ఇప్పుడు ఆ పప్పులేవి ఉదకవని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర ధ్యక్షులని నియమించిన మరుక్షణమే వారిలో భయం పట్టుకుందని, తమ భవిష్యత్తు కార్యాచరని ఏంటి అని మల్లగుల్లాలు పడుతున్నారని, వైసీపీకి కొమ్ముకాసిన బీజేపీ నాయకులకి పురేందేశ్వరి త్వరలోనే షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం, ఆ భయంతోనే పార్టీలో ఉండాలి వద్దా? అని సతమతవుతున్నారని తెలుస్తోంది.