తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని వాడు, వీడు అంటూ దుర్భాషలాడాడు. జొమాటో డెలివరీ బాయ్ అంటూ.. సీఎంతో పాటు.. కష్టపడి పని చేసే డెలివరీ పార్ట్‌నర్స్‌ని అవమానించాడు. ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదులు రావడంతో.. తెలంగాణ పోలీసులు గుంటూరు వెళ్లి.. వైసీపీ నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేశారు.
ఇడుపు కాయితం అనే సినిమా టైటిల్‌కి అర్ధం ఏంటని ఎవరో అనామకుడు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మాట్లాడితే.. తెలంగాణ భాషను అవమానిస్తున్నారంటూ.. కొంత మంది మేధావులు, జర్నలిస్టులు, పొలిటీషియన్స్.. ఆ అంశాన్ని పెద్ద వివాదం చేశారు. ఏపీలో పాలిటిక్స్ మీదా.. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఫేక్ స్టోరీలు ప్రచారం చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై.. జనసేన నాయకులు ఫిర్యాదు చేస్తే.. తెలంగాణ మేధావిని అవమానిస్తున్నారని పెద్ద సీన్ క్రియేట్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌పై బూతులు ప్రయోగించిన యూట్యూబర్‌ను అరెస్ట్ చేసినప్పుడూ.. తెలంగాణ జర్నలిస్టుని ఆంధ్రా పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు.. తెలంగాణపై ఆంధ్రా పాలకుల పెత్తనమేంటని అంతెత్తున ఎగిరారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిని.. వైసీపీ నేత వాడు వీడు అని అనుచితంగా మాట్లాడినా.. ఈ తెలంగాణ వాదుల్లో ఒక్కరు కూడా స్పందించలేదు. తెలంగాణ సీఎంని జొమాటా డెలివరీ బాయ్ అని అవమానించినా.. తెలంగాణకు అవమానం జరిగిందని ఎవరూ అనలేదు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వెయ్యి కోట్ల భూమిని కబ్జా చేయాలని చూసినా.. తెలంగాణవాదులు పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేశారే తప్ప.. మా తెలంగాణ సంపద దోచుకొంటున్నారని నిలదీయలేదు. ఈ కేసుల్లో రియాక్షన్లు చూస్తే.. కేవలం తెలుగుదేశం, జనసేన నాయకులు.. కార్యకర్తలు మాట్లాడితేనే సదరు మేధావులు, జర్నలిస్టులకు తెలంగాణవాదం గుర్తుకొస్తుంది. వైసీపీ నాయకులు ఎంత అవమానకరంగా మాట్లాడినా.. ఎన్ని వేల కోట్లు దోపిడీలు చేసినా.. మహా మేధావులంతా గజనీలైపోతారు. సెలెక్టివ్ పాలిటిక్స్ చేస్తూ.. వైఎస్ జగన్‌కి, వైసీపీకి అనుకూలంగా.. టీడీపీకి, జనసేనకు వ్యతిరేకంగా పాలిటిక్స్ చేస్తున్న వాళ్లను.. తెలంగాణవాదులు అని కాకుండా వైసీపీ వాదులు, జగన్ సేవకులు అనడం కరెక్ట్ అవుతుందేమో.










