July 5, 2026 11:42 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

July 2, 2026 at 12:51 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం గుర్తుచేసుకుందాం..

వెనకటికి ఒక కోతి ఉండేది. అసలే కోతి.. ఆపైన చాలా కోతివేషాలు వేస్తుండేది. ఆ కోతివేషాల్లో భాగంగా.. ఒకసారి దాని తోక ఒక ముళ్లకంపలో ఇరుక్కుపోయింది. ఇక చేసేదేముంది.. ఆ కంపతో సహా.. తోకను జాగ్రత్తగా పట్టుకుని మంగలి దగ్గరకు వెళ్లి.. తోకను కాపాడమని అడిగింది. ఆ మంగలి కత్తితో కంపను వేరుచేసే ప్రయత్నంలో.. ఏకంగా దాని తోక తెగిపోయింది. అతడితో గొడవపెట్టుకునేసరికి.. ‘బాబ్బాబూ గొడవ చేయొద్దు.. కావాలంటే నా కత్తి తీసుకువెళ్లు’ అన్నాడు. అది పుచ్చుకుని.. ‘తోకపాయె కత్తి వచ్చె టాం..టాం..టాం..’ అని పాడుకుంటూ తిరగసాగింది. దారమ్మట వెళుతున్న ఓ డోలు వాద్యగాడికి కత్తితో ఏదో అవసరమై కోతిని అడిగాడు. కత్తి ఇచ్చింది. అతడు పని చేసుకుంటుండగా కత్తి విరిగిపోయింది. కోతి గొడవ చేసేసరికి.. అతడు బతిమాలి కత్తికి బదులుగా తన డోలు ఇచ్చాడు. అప్పుడా కోతి..

తోకపాయె కత్తి వచ్చె టాం.. టాం..టాం..
కత్తిపాయె డోలు వచ్చె టాం..టాం..టాం..

అంటూ పాడుకుంటూ తిరగసాగింది. ఇలా అల్లుకుంటూ పోతే ఎంతపొడవైన కథైనా చెప్పుకోవచ్చు. ఆ కోతిలాగా ఎన్ని పాట్లు పడినా కూడా.. ఎన్ని పాటలు పాడినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం మళ్లీ అధికారం మాత్రం రాదు అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డికి తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశ. నిజానికి ఏ నాయకుడికైనా అలాంటి కల ఉంటుంది. ఆ కలను నిజం చేసుకోవాలంటే.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేయాలి. అభివృద్ధి పరంగా.. శాశ్వతంగా తన కీర్తి మిగిలిపోయే అద్భుత ప్రాజెక్టులు తీసుకురావాలి. ఫరెగ్జాంపుల్ హైదరాబాదులో ఇవాళ్టికి కూడా హైటెక్ సిటీ వాసులు, అక్కడి కంపెనీల ఉద్యోగులు చంద్రబాబునాయుడుకు నీరాజనాలు పడుతుంటారంటే కారణం అదే. హైటెక్ సిటీ అనేది చంద్రబాబునాయుడు దార్శనికతకు నిదర్శనం. ఆయన అద్భుతపాలనా పటిమకు ఒక రుజువు! ఇవాళ మాత్రమే కాదుకదా.. మరో వెయ్యేళ్లు గడిచినా కూడా హైటెక్ సిటీ యొక్క ఫలాలను అందుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా.. చంద్రబాబునాయుడును నిత్యం స్మరించుకుంటూనే ఉంటారు.

చరిత్రలో నిలిచిపోవడం అంటే అలాంటి మంచి పనులు చేయాలి. కానీ.. కుట్రలు, కుత్సితాలు, కూహకాలు తప్ప మరొకటి తెలియని గొడ్డలి పార్టీ అధినేతకు అవేమీ తెలియదు. తన పేరు శాశ్వతంగా ఉండిపోవాలంటే.. ప్రజల ఆస్తులకు సంబంధించిన పాస్ బుక్కుల మీద తన పేరు, ఫోటో ముద్రించుకోవడమే ఆయనకు తెలిసిన విద్య. అన్నదాతలకు తరతరాలుగా సంక్రమించిన, చెమట చిందించి కొనుక్కున పొలాల్లో హద్దురాళ్లమీద తన బొమ్మ చెక్కించుకోవడం మాత్రమే ఆయనకు తెలుసు. అలాంటి అసహ్యకరమైన కీర్తికాంక్షతో కూడిన నాయకుడు గనుకనే.. ప్రజలు అత్యంత దారుణంగా ఛీత్కరించి.. ఆయనను కేవలం 11 సీట్లకు పరిమితం చేసి.. బెంగుళూరు ప్యాలెస్ లో కూర్చోబెట్టారు.

ప్రజలు అంత ఘోరంగా ఛీత్కరించుకున్నా జగన్ బుద్ధి మాత్రం మారలేదు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జగన్ బొమ్మల పిచ్చికి చరమగీతం పాడింది. పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వ రాజముద్రతో అందిస్తోంది. హద్దురాళ్లపై జగన్ బొమ్మలను తొలగించింది. రాళ్లమీద తన తలను తీసేసరికి జగన్ కొత్త ఎత్తుగడ వేశారు. తన పేరు మాత్రం శాశ్వతంగా నిలుపుకోవాలని అనుకుంటున్నారు. మావిగన్ అనే అత్యంత అసంబద్ధమైన ప్రతిపాదన తీసుకువచ్చి.. అందులో తన పేరు చూసుకుని మురిసిపోతున్నారు. మావిగన్ పేరు వింటే.. చంద్రబాబుకు జగన్ గుర్తుకొచ్చి నిద్ర రాదేమో.. అని చీప్ కామెడీ చేస్తుండే జగన్ రెడ్డి.. మావిగన్ అనే చిత్రివిచిత్రమైన హాస్యాస్పదమైన పదాన్ని తలచుకుని.. అందులో తన పేరు ఉన్నదని మహా మురిసిపోతున్నట్టుగా కనిపిస్తోంది.

మావిగన్ రాజధాని అయితే.. గెలిచిన తర్వాత.. అందులో తన పేరు శాశ్వతంగా మిగిలిపోతుందని ఆయన అనుకుంటున్నట్టుగా ఉంది. కానీ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రప్రజలు మరొకసారి తన మాయమాటలు నమ్మి మోసపోయేంత అమాయకులు కాదు అనే సంగతి ఆయన తెలుసుకోవడం లేదు.

రాళ్ల మీద బొమ్మలు వేసుకోవాలనే కుట్ర చేస్తే ప్రజలు ఛీత్కరించుకున్నారు. అద్భుతంగా తయారవుతున్న రాజధానిమీద ద్వేషంతో విషం కక్కుతూ.. ప్రత్యామ్నాయం పేరిట తన పేరు చూసుకునే ఉబలాటంతో మావిగన్ అంటోంటే.. జనం అంతకంటె ఘోరంగా అసహ్యించుకుంటున్నారు.

జగన్ మాత్రం.. ‘రాళ్లు పోయె పేర్లు వచ్చె టాం..టాం..టాం..’ అంటూ పైత్యపు పాటలు పాడుకుంటూ కాలం గడపాల్సిందే.

Tags: leonewsleotopmavigantopnewsys jaganఅమరావతిఅమరావతిపై జగన్ విషంమావిగన్
Previous Post

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

Related Posts

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

బాధాకరమే కానీ.. విలువైనదంటోన్న రష్మీ రాకెట్ ..!

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

పాన్ ఇండియా కాదు.. ‘ప్లాన్ ఇండియా’ సినిమా కావాలి

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వేలు ఏం చెబుతున్నాయి?

రకుల్ మూడు పడవల ప్రయాణం!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist