ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనబాట పట్టారు. ఫ్యాక్టరీలు కిలోకు కనీసం రూ.15 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వినడానికి ఇది బాగానే ఉన్నా…అధికారంలో ఉన్న నాడు మామిడి రైతులను జగన్ సర్కార్శ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు.
వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు కానీ, గత ఐదేళ్లలో చిత్తూరు జిల్లాలో తోతాపురి ధరలు కిలో రూ.4 నుండి రూ.6 కి పడిపోయినప్పుడు ఈ నేతలంతా ఎక్కడున్నారనేది తమ్ముళ్ల మొదటి ప్రశ్నగా ఉంది. నాడు పల్ప్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు సిండికేట్‌గా మారి ధరలు తొక్కిపెడితే, అప్పటి ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించలేదు సరి కదా.. అసలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ వాడిన దాఖలాలు కూడా లేవు. నాడు ఫ్యాక్టరీల గేట్ల ముందు కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు నిలిచి రైతులు అల్లాడినా నోరు మెదపని నేతలు, నేడు సీన్ మారగానే రోడ్లపైకి రావడం పక్కా పొలిటికల్ స్టంట్.
ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వంలా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఫ్యాక్టరీలు కిలో రూ.6-7 ఇస్తుంటే, ప్రభుత్వం Price Deficiency Payment Scheme – PDPS కింద అదనంగా కిలోకు రూ.4 సబ్సిడీని నేరుగా రైతు ఖాతాల్లో వేసే పద్ధతి తీసుకువచ్చింది. ఇప్పుడు పల్ప్ పరిశ్రమలను నియంత్రించేందుకు, టోకెన్ విధానాన్ని క్రమబద్ధీకరించేందుకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. ఇవన్నీ పక్కనబెట్టి, కర్ణాటకలో రూ.17 ఇస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు”అంటూ పొరుగు రాష్ట్రాలతో పోలికలు పెట్టడం కేవలం మైలేజ్ కోసమేనని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
అంతేకాదు, వైసీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో పల్ప్ ఫ్యాక్టరీలను శాసించింది ఏ శక్తులు అనే ప్రశ్న కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. నాడు అధికార పార్టీ అండదండలతోనే ఫ్యాక్టరీల యజమానులు ఏకపక్షంగా ధరలు నిర్ణయించి, రైతు రక్తం తాగారనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ సిండికేట్‌ను బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తుంటే, తట్టుకోలేక ఉనికి చాటుకోవడం కోసం వైసీపీ డ్రామాలు










