అమెరికా ప్రెసిడెంట్ కి ఏం ఖర్మ ? అంత హోదాలో ఉండి , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గా మారాల్సిన ఖర్మ ఏంటి అనుకుంటున్నారా ? ప్రెసిడెంట్ కి అంత గతి పట్టలేదు కానీ తెలుగు సినిమాకి ఆ గతి పట్టించారు సొంత బుర్ర లేని మన తెలుగు దర్శక , రచయితలు. మైఖేల్ డగ్లస్ హీరోగా 1995 లో ‘ ది అమెరికన్ ప్రెసిడెంట్ ” సినిమా వచ్చింది . అమెరికా ప్రెసిడెంట్ అనుకోకుండా తన దగ్గర పని చేసే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయితో డేటింగ్ చేయాలనీ ప్రెసిడెంట్ ట్రై చేస్తుంటాడు.
ఫోన్ చేసి తాను అమెరికా ప్రెసిడెంట్ అంటే నమ్మదు. తన ఆఫీస్ ల్యాండ్ నెంబర్ ఇచ్చి, ప్రెసిడెంట్ కి కనెక్ట్ చేయమని చెప్పమంటాడు . ఆ అమ్మాయి ఫోన్ చేసి షాక్ అవుతుంది . అమెరికా ప్రెసిడెంట్ తనని ప్రేమిస్తున్నాడని తెలిసి ఆ అమ్మాయి థ్రిల్ అవుతుంది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. వీరి ప్రేమ వ్యవహారం మీడియాకి లీక్ అవుతుంది. ప్రెసిడెంట్ పదవి లో ఉన్న వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తో గడపటం ఆ పదవిని అవమానించడమే అని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి.
ప్రెసిడెంట్ తన పరువు, ప్రియురాలి పరువు పోకుడదని ఓ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మీడియాని తిట్టిపోస్తాడు. తన పదవి కి రాజీనామా చేస్తాడు . చివరకి హీరో తిరిగి తన పదవి లోకి ఎలా వస్తాడు ? తన ప్రియురాలిని ఎలా దక్కించుకుంటాడు ? అనేది ఆ సినిమా మిగిలిన కథ . ఇది చదువుతుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది కదా ?! మీరు కరెక్టే . కొరటాల శివ డైరెక్ట్ చేసిన మహేష్ బాబు ‘ భరత్ అనే నేను ‘ లో ఈ లవ్ ట్రాక్ వాడుకున్నారు.పైన చెప్పిన సీన్స్ యథాతథంగా వాడుకున్నా , ప్రెస్ మీట్ సీన్ అయితే డైలాగ్స్ , షాట్స్ మక్కి కి మక్కీ దింపారు. ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు కొరటాల.
అమెరికా ఎంత ఫ్రీ కంట్రీ అయినా ప్రెసిడెంట్ అనే వాడు కొన్ని విలువలు మెయింటైన్ చేయాలనుకుంటారు. అసలు ప్రేమ వ్యవహారాలు సహించరు . మోనికా లెవెన్ స్కీ – బిల్ క్లింటన్ గొడవ గుర్తు ఉందిగా ?! ప్రెసిడెంట్ రాజీనామా చేసేటంత వరకు మీడియా, ప్రజలు ఊరుకోరు . మన ఇండియాలో ముఖ్యమంత్రి ప్రేమలో పడితే రాజీనామా చేయమని అడగరు. కానీ కొరటాల శివ అది ఆలోచించకుండా, హాలీవుడ్ సినిమాని ఫాలో అయిపోయారు . ‘కాపీ కొట్టం… మా దగ్గరే బోలెడు ఐడియాలు ఉన్నాయని మన తెలుగు దర్శక రచయితలు బుకాయిస్తూనే ఉంటారు . ప్రేక్షకులకి అన్నీ తెలుసు . సమయం వచ్చినప్పుడు వాళ్లే రియాక్ట్ అవుతారు. సన్నివేశాలకు సన్నవేశాలనే ఇలా లేపేయటాన్ని ఏమంటారో ఆలోచన కలిగిన వారు చెప్పాలి.