తక్కెళ్లపాడు గ్రామంలో సర్వేరాయి వేసి భూ హక్కు భూ రక్ష రీ సర్వే ఫైలెట్ ప్రాజెక్టును సీఎం ఆరంభించారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంపై ఎల్లోమీడియాలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు రాసి రకరకాల కుయుక్తులు పన్నుతారని సీఎం తీవ్ర విమర్శలు చేశారు. ఈ సర్వే ద్వారా భూములపై ఉండే అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. భూ యజమానులకు చెక్కుచెదరని శాశ్వితంగా ఉండే పట్టాలు ఈ పథకం ద్వారా వస్తాయని ఆయన గుర్తుచేశారు. భూములకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించేందుకే తక్కెళ్లపాడు నుంచి శాశ్విత భూ హక్కు భూ రక్ష పథకానికి శ్రీకారం చుట్టినట్టు సీఎం ప్రకటించారు.
రికార్డులు ఇక పక్కా
భూ రికార్డులు పక్కాగా ఉంటే కబ్జాదారులపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని సీఎం స్పష్టం చేశారు. అక్రమార్కులకు తమది కాని భూమి పాడి ఆవులా మారిందని జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సీఎం జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గిట్టనివారు భూమి హద్దురాళ్లు పీకేసినా శాశ్విత హక్కు పత్రాల్లో కొలతలు మార్చడం సాధ్యం కాదన్నారు. చెక్కుచెదరని కొలతలతో ఉండే హక్కు పత్రాలను ప్రజలకు అందించడం జరుగుతోందని సీఎం భరోసా ఇచ్చారు. ప్రజల భూమికి ప్రభుత్వం హామీ ఇస్తుందన్నారు.
ప్రతి రెవెన్యూ గ్రామంలో మ్యాప్ ఉంటుంది
వంద సంవత్సరాల తరవాత జరుగుతున్న భూ సర్వేలో నూతన సాంకేతిక పరిజ్ఙానం వినియోగిస్తున్నారు. దీని ద్వారా భూమి హక్కు పత్రాల్లో అక్షాంశ, రేఖాంశాలను కూడా నెంబర్లతో ఇస్తారు. వీటిని మార్చడం ఎవరి తరం కాదు. దీని వల్ల భూమి కబ్జాకు గురికాదని సీఎం భరోసా ఇచ్చారు. మనిషులకు ఆధార్ నంబరు తరహాలో ప్రతి భూమికి యూనిక్ ఐడెంటిటీ నెంబరు కేటాయిస్తారని సీఎం తెలిపారు. దీని వల్ల భూమి నెంబరుతో అన్ని వివరాలు తెలుసుకునే వీలు దొరుకుతుందన్నారు.
Must Read ;- ఆ గుండెలు జె టాక్స్.. జె టాక్స్ అంటూ కొట్టుకుంటున్నాయ్!