డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలి అనుకున్నారు. మహేష్ కి పూరి కథ చెప్పడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కానీ.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత పూరి ఈ కథను వెంకటేష్ కి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈ కథకు ఓకే అన్నారు కానీ.. బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల ముందుకు వెళ్లలేదు.
ఆ తర్వాత పూరి… కేజీఎఫ్ హీరో యాశ్ తో జనగణమన చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. ఇది కూడా వార్తలకే పరిమితం అయ్యింది తప్ప.. ముందుకు వెళ్లలేదు. జనగణమన కోసం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కూడా గట్టిగా వినిపించింది కానీ.. ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఫైనల్ గా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సెట్ అయ్యింది. పూరి, విజయ్ కలిసి లైగర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది.
ఇలా లైగర్ మూవీ షూటింగ్ పూర్తయ్యిందో లేదో.. అలా జనగణమన షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఛార్మి ట్విట్టర్ లో పూరి జగన్నాథ్ వాయిస్ ని పోస్ట్ చేసింది. ఇందులో పూరి… ఇప్పుడే లైగర్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ రోజుతో జనగణమన అన్నారు. దీనిని బట్టి జనగణమన చిత్రం చేస్తున్నామనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. మరి.. విజయ్, పూరి కలిసి లైగర్, జనగణమన చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.











