పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాతో భారీ విజయం సాధించాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ అండ్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం హిందీ వెర్షెన్ కి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత తెలుగు వెర్షెన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందివ్వనున్నారని వార్తలు వచ్చాయి. దీంతో రాధేశ్యామ్ కి మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజమే అనుకున్నారు కానీ.. అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.
తాజా వార్త ఏంటంటే.. రాధేశ్యామ్ తెలుగు వెర్షెన్ కి దర్శకధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలిసింది. అంతే కాకుండా.. రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోనూ, అలాగే ముంబాయిలోను ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు ఈవెంట్లలో ఏదో ఒక ఈవెంట్ లో రాజమౌళి పాల్గొంటారని సమాచారం. ప్రభాస్, రాజమౌళి మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. అందుకనే.. ప్రభాస్ కోసం రంగంలోకి దిగనున్నారు రాజమౌళి.











