రూ. 225 కోట్ల ఇస్తాం ..
దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరుతో వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేసేందుకు తండ్రి రాజమెహన్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు గానూ వర్సీటీ ఏర్పాటుకు ఉదయగిరిలో స్థాపించిన రూ. 225 కోట్ల విలువైన మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వానికి స్వాదీనం చేస్తామని సీఎం జగన్ కు రాజమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వంద ఎకరాల్లో స్థాపించిన రూ. 225 కోట్ల విలువైన మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాలను, అందులోని భవనాలను, ఇతరత్రా ఆస్తులను ప్రభుత్వానికి స్వాదీనం చేస్తామని పేర్కొన్నారు. ఉదయగిరి గౌతమ్ అంత్యక్రియలకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్ తో ఆయన ఏకాంతంగా ఇదే అంశంపై చర్చించారు.
ఏర్పాటుకు చర్యలు..
ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకాల మరణానికి ఆత్మకూరు నియోజకవర్గం తల్లడిల్లింది. కుటుంబ సభ్యుల రోధనలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అత్యంత వెనుకబడి మెట్ట ప్రాంతంగా భావించే ఆత్మకూరు నియోజకవర్గంలో సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు గౌతమ్ అహర్నిశలు శ్రమించారు. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం, సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ -1, ఫేజ్ నెంబర్ -2 పనులను పూర్తి చేయాలని ఆయన గౌతం కోర్కె అని సీఎం జగన్ కు రాజమోహన్ రెడ్డి గుర్తు చేశారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
Must Read:-ఏపీపీఎస్సీ నూతన చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు











