వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో మైండ్ బ్లాక్ అయ్యే సంచలన విషయాలు బయటపడ్డాయి. బెంగళూరులోని అత్యంత ఖరీదైన యలహంక ప్యాలెస్ ల్యాండ్ చుట్టూ జరుగుతున్న డ్రామాకు తెరదించుతూ ఒక షాకింగ్ నిజాన్ని బహిర్గతం చేసే పక్కా ఆధారం వెలుగులోకి వచ్చింది. ఇంతకాలం యలహంక ప్యాలెస్ తనదేనని, అక్కడ ఎవరికి ఎంత హక్కు ఉండాలో నిర్ణయించేది తనేనని జగన్ మోహన్ రెడ్డి అండ్ కో ఆడుతున్న నాటకాలకు గట్టి చెక్ పడిందంటున్నారు. ఆ భూమిపై సర్వహక్కులు వైఎస్ షర్మిలకే ఉన్నాయని, అది ఆమె సొంత ఆస్తి అని ఇప్పుడు తేలిపోయిందట.
వైఎస్సార్ సతీమణి విజయమ్మ స్వయంగా ఆమోదించిన నోటరైజ్డ్ డాక్యుమెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ డాక్యుమెంట్ ప్రకారం యలహంక ప్యాలెస్ ల్యాండ్ పూర్తిగా షర్మిలకు చెందినదేనని క్లియర్ కట్‌గా స్పష్టమవుతోందట. ఆ భూమిపై ఆమెకు పూర్తి అధికారాలు, సర్వహక్కులు ఉన్నాయంటున్నారు. అలాంటిది, తన కూతురి వివాహాన్ని అక్కడ జరిపించుకోవడానికి షర్మిలకు ఉన్న హక్కును అడ్డుకోవడానికి జగన్ ఎవరు? అసలు ఆయనకు ఏం అధికారం ఉందనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
ఇంతకాలం వైసీపీ నాయకులు, జగన్, వారి అధికార ప్రతినిధులు ప్రజలను పూర్తిగా పక్కదారి పట్టించారన్న ప్రచారం జరుగుతోంది. యలహంక ప్యాలెస్ ల్యాండ్ జగన్‌దేనని, అక్కడ షర్మిలకు దక్కే హక్కులన్నీ జగన్ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉన్నాయని రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేశారట. కానీ, ఇప్పుడు బయటపడిన ఈ షాకింగ్ ప్రూఫ్స్ జగన్ ఆడుతున్న మైండ్ గేమ్‌ను బట్టబయలు చేశాయంటున్నారు. అది జగన్ దయతో ఇచ్చే ఆస్తి ఎంతమాత్రమూ కాదని… అచ్చంగా, నిఖార్సైన షర్మిల సొంత ఆస్తి అని తేల్చి చెబుతున్నారు.
సొంత చెల్లెలి ఆస్తి హక్కులకే ముప్పు తెచ్చేలా వ్యవహరించిన జగన్, ఇప్పటికైనా ఈ అబద్ధపు ప్రచారాలను ఆపి నిజాలను ఒప్పుకుంటారా? షర్మిల కూతురి పెళ్లి ఎలాంటి గొడవలు లేకుండా జరిపిస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి ఈ సంచలన ఆధారాలతో యలహంక ప్యాలెస్ వివాదంలో జగన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారని స్పష్టమవుతోందంటున్నారు.











