నటసింహం నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ సినిమాతో సక్సెస్ సాధించిన మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకీ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతాయి.
క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు. అయితే.. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు ముందుగా శ్రుతిహాసన్ ని కాంటాక్ట్ చేశారు. కారణం ఏంటంటే.. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన బలుపు, క్రాక్ సినిమాల్లో శ్రుతి హాసన్ హీరోయిన్. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. అందుకనే శ్రుతిహాసన్ మలినేని గోపీచంద్ కి సెంటిమెంట్ గా మారింది. అందుకనే బాలయ్య సినిమా కోసం కూడా శ్రుతి అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట.
ముందు శ్రుతి హాసన్ నో చెప్పిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు ఎస్ చెప్పిందట. దీపావళి సందర్బంగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఓ అప్ డేట్ ఇచ్చారు. అదే.. బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్‌ను ఎంపిక చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో కధానాయిక శృతి హాసన్ కి ఇది మూడో సినిమా కాగా.. నందమూరి బాలకృష్ణతో శృతి హాసన్ మొదటి సారిగా కలసి నటించబోతున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సో.. మలినేని గోపీచంద్ సెంటిమెంట్ ప్రకారం.. బొమ్మ బ్లాక్ బస్టరే అవుతుందేమో చూడాలి.
Must Read ;- గీతా ఆర్ట్స్ లో బాలయ్య మూవీకి డైరెక్టర్ ఫిక్స్?











