మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ నెల 8న ఈ సినిమాను భారీ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారని తెలిసింది. అయితే… ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే… ఈ సినిమా ప్రారంభోత్సవానికి బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్టు చెపుతున్నారు. చరణ్ కెరీర్ లో ఇది 15వ చిత్రం కాగా దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం.
కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబర్ 8 నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల షూటింగ్స్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని శంకర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అని.. ఇందులో చరణ్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
మరో విషయం ఏంటంటే.. ఈ క్రేజీ మూవీని 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున రిలీజ్ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- చరణ్ నో చెప్పిన స్టోరీకి యష్ ఓకే చెప్పాడా.