మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్ మూవీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఊటీలో గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి 154వ చిత్రం చేయనున్నారు. దీనికి టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే.. ఈ సినిమాలో రవితేజ నటించనున్నారు అనే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇది నిజమేనా..? కాదా..? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే… ఈ సినిమాలో కీలక పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం బాబీ రవితేజను కాంటాక్ట్ చేశారని తెలిసింది. గతంలో చిరంజీవి సినిమా అన్నయ్యలో రవితేజ నటించారు. ఆతర్వాత శంకర్ దాదా జిందాబాద్ లో రవితేజ అతిథి పాత్ర పోషించారు. ఇప్పుడు మరోసారి చిరంజీవి సినిమాలో రవితేజ నటించనున్నట్టు సమాచారం.
ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రామ్చరణ్ ఎక్కువగా నటిస్తున్నారు. మెగా హీరోల సంఖ్య ఎక్కువగా ఉంది. వారిలో ఎవరినైనా చిరంజీవి సినిమాలో నటింప చేయవచ్చు అయితే.. డైరెక్టర్ బాబి తన ప్లాన్ను మార్చి మరో హీరోను నటింప చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే రవితేజతో తనుకున్న అనుబంధాన్ని ఉపయోగించుకుని ఈ సినిమాలో నటించమని రిక్వెస్ట్ చేశాడట. చిరు పై అభిమానంతో రవితేజ ఓకే చెప్పారని అంటున్నారు. అయితే.. ఇది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.
Must Read ;- మెగాస్టార్ సరసన మిల్కీబ్యూటీ.. ఇది నిజమా..?