కొందరు బ్యూటీస్ కి అందం , ఆకర్షణ తో పాటు అభినయంలో మంచి టాలెంట్ ఉన్నా కూడా సరైన గుర్తింపు దక్కదు. అలాంటి వారు మన భారతీయ తెరమీద చాలా మంది ఉన్నప్పటికీ.. అందులో కొందరు ఏదో ఒక సందర్బంలో మళ్ళీ వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి ఓ అందాల భరిణ అక్షా పార్దసాని. ముగ్దమోహన రూపం, కలువ రేకుల్లాంటి కళ్లు, సంపంగి పువ్వులాంటి ముక్కు. ఇలా ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ ఆమె కథానాయికగా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ముంబై స్కాటిష్ స్కూల్లో 12th స్టాండర్డ్ కంప్లీట్ చేసింది అక్ష. అయితే ఆమె ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే.. దాదాపు 75 కమర్షియల్ యాడ్స్ లో నటించి మెప్పించింది. ముసాఫిర్ హిందీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే గోల్ మలయాళ మూవీతో అక్కడా కథానాయికగా మెరిసింది. ఇక ‘యువత’ తెలుగు సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది అక్ష. ఆ తర్వాత రైడ్, అదినువ్వే, కందిరీగ, రై రై, మెంటల్ పోలీస్, బెంగాల్ టైగర్, డిక్టేటర్ , రాధ లాంటి మూవీస్ లోనూ నటించింది. అలాగే.. జమ్తారా సబ్ కా నంబర్ ఆయేగా, కాట్మండు కనెక్షన్ లాంటి వెబ్ సిరీస్ లోనూ అలరించింది.
ఇక అక్షా పార్ధసాని సోషల్ మీడియాని కూడా తన ఇతర వ్యాపకంగా పెట్టుకుంది. తరచుగా తన హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ.. అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆమె షేర్ చేసే సెన్సువల్ పోజులకు, హాటెస్ట్ స్టిల్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంటుంది. ఈ క్రమంలో అక్షా షేర్ చేసిన తాజా ఫోటోస్ ఇన్ స్టాను అల్లాడిస్తున్నాయి. వైట్ లాంగ్ షర్ట్ పై బోటమ్ ఏమీ తొడగకుంటా.. ఆమె ఇచ్చిన బోల్డ్ పోజులు మతి పోగొడుతున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Must Read ;- ‘ఏక్ మినీ కథ’ బ్యూటీ షాకింగ్ బికినీ ట్రీట్