టీవీ, సినిమా ప్రేక్షకులకు అనసూయ పేరొక వైబ్రేషన్. ఇటు బుల్లితెర, అటు వెండితెర అమ్మడికి రెండు కళ్ళు. ఈ రెండు చోట్లా ఆమెకి సమానమైన ఫాలోయింగ్ ఉంది. పెళ్ళయినప్పటికీ.. ఆమె అందం ఇసుమంతైనా తరగలేదు సరికదా.. మరింతగా కాంతులు చిందడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. అందుకే ఆమె ఇటు యాంకర్ గానూ, అటు నటీమణిగానూ అంతలా రాణిస్తోంది.
ప్రస్తుతం అనసూయ ప్రధానపాత్రల్లో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. అలాగే.. తమిళ, మలయాళ భాషల్లో సైతం అను .. ఎంట్రీ షురూ చేస్తోంది. ఇక యాంకర్ గానూ ఆమె స్థానం ఎవరూ భర్తీ చేయలేనిది కావడంతో.. ఆమెకి అక్కడ కూడా ఎలాంటి ఢోకా లేదు. అలా ఇతర భామలు అసూయ పడేంత అందంగా అనసూయ దుమ్మురేపుతోంది.
ఇక అనసూయ కి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్ తో ఇన్ స్టాను హీటెక్కించే అనూ బేబ్.. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ .. నెటిజెన్స్ ను ఓ రేంజ్ లో కవ్విస్తున్నాయి. బ్లాక్ కలర్ లాంగ్ ట్రాన్స్ పెరెంట్ గౌన్ లాంటి కోటు వేసుకొని.. లోపల టాప్ అండ్ షార్ట్ లో రివీలైన ఆమె ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దానికి తోడు.. ఆమె ఇచ్చే హాట్ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి.
Must Read ;- తెల్లచీరలో కవ్విస్తోన్న అందాల రంగమ్మత్త