టాలీవుడ్ లో ప్రస్తుతం అనూహ్యమైన కాంబో మూవీస్ సెట్ అవుతున్నాయి. అనుష్కలాంటి క్రేజీ హీరోయిన్ ఎక్కడ? హీరోగా ఇప్పుడిప్పుడే పైకొస్తున్న నవీన్ పోలిశెట్టి ఎక్కడ? ఈ ఇద్దరి కలయికలో ఒక సినిమాను అందులోనూ, ప్రేమకథా చిత్రాన్ని సెట్ చేయడం మాటలా? ఈ అసాధ్యమైన కాంబోను సుసాధ్యం చేసిన దర్శకుడు ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేశ్ .
‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ ను టేకప్ చేయని అనుష్క శెట్టి.. ఎట్టకేలకు ఇప్పుడు చేయబోయే సినిమా ఇదే అవడం విశేషంగా మారింది. ఇటీవల జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి.. అందరి దృష్టిని ఆకర్షించిన నవీన్ పోలిశెట్టి అనుష్క సరసన హీరోగా నటించే అరుదైన ఛాన్స్ కొట్టేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతోంది.
40 ఏళ్ళ ఒక పెళ్ళికాని పడుచు .. 20 ఏళ్ళ కుర్రోడితో ప్రేమలో పడడం ఈ సినిమా కథాంశం. ఎమోషన్స్ విత్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ సినిమాకి ‘మిస్ శెట్టి- మిస్టర్ పోలిశెట్టి’ అనే వెరైటీ టైటిల్ ను దాదాపు ఖాయం చేసినట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి ఈ టైటిల్ ను ఎంపిక చేస్తున్నారన్న వార్తలు ఇదివరకే వచ్చినా.. ఇప్పుడు ఈ టైటిల్ ను ఫైనలైజ్ చేయడం విశేషంగా మారింది. మరి అనుష్క తో నవీన్ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Must Read ;- ‘జాతిరత్నాలు’ సీక్వెల్ కు రంగం సిద్ధం