‘లక్కీ’ సినిమాతో బాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది అందాల స్నేహా ఉల్లాల్. అచ్చుగుద్దినట్టు ఐశ్వర్యా రాయ్ లా ఉండే అమ్మడికి తొలి సినిమాతోనే జూనియర్ ఐష్ అనే బిరుదు ఇచ్చేశారు బీ టౌన్ జనం. అదే అమ్మడికి వరంగానూ, శాపంగానూ మారింది. జూనియర్ ఐష్ అనే బిరుదు వచ్చినంత మాత్రాన అవకాశాలు రాకపోతే.. స్నేహ మాత్రం ఏం చేస్తుంది? బాలీవుడ్ లో ఆ క్రేజ్ తో హీరోయిన్ గా సస్టెయిన్ కాలేకపోయింది.
ఇక ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది స్నేహా ఉల్లాల్. ఆ తర్వాత ‘నేనే మీకు తెలుసా, కరెంట్ , వరుడు, సింహా, అలా మొదలైంది, మడతకాజా, యాక్షన్ 3డి’ సినిమాల్లో నటించింది. అయినప్పటికీ అమ్మడికి సరైన గుర్తింపు రాలేదు. జూనియర్ ఐశ్వర్యా ట్యాగ్ ఇక్కడ కూడా పనిచేయలేదు. ఆ తర్వాత నుంచి స్నేహ ఉల్లాల్ అనే పేరు టాలీవుడ్ లో వినిపించనేలేదు. ప్రస్తుతం స్నేహ కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అలాగే.. సోషల్ మీడియాలోనూ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. తన ఉనికిని చాటుకుంటోంది.
ఇప్పుడు ఒక్కసారిగా స్నేహ ఉల్లాల్.. సోషల్ మీడియాలో తన టాప్ లెస్ బ్యాక్ తో దుమారం రేపుతోంది. ఒక పురుషుడి కౌగిలిలో చాలా హాట్ గా ఈ ఫోటో కనిపిస్తోంది. అంతేకాదు.. ఆమె తో ఉన్న అతడు ఎవరు అనే విషయం కూడా తెలియడం లేదు. ఈ ఫోటోని స్నేహ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా.. అందులో ఉన్నది స్నేహానేనా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. అయితే ఇది ఆమె నటిస్తోన్న ఓ హాట్ వెబ్ సిరీస్ కు సంబంధించింది అనే టాక్ మరో వైపు వినిపిస్తోంది. అందులో భాగంగానే స్నేహా ఉల్లాల్ అలా బోల్డ్ గా రివీలైందని అంటున్నారు. మరి ఈ ఫోటో గురించి మరిన్ని వివరాలు స్నేహా ఉల్లాల్ ఏమైనా చెబుతుందేమో చూడాలి.
Must Read ;- తెల్లచీరలో కవ్విస్తోన్న అందాల రంగమ్మత్త