అక్కినేని వారి వారసుడు యార్లగడ్డ సుమంత్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్నాడు. అతడి కెరీర్ లో సత్యం, మధుమాసం, గౌరీ, గోదావరి, మళ్ళీరావా, లాంటి సినిమాలు మాత్రమే చెప్పుకోదగ్గవి. మళ్ళీ అలాంటి సక్సెస్ కోసం నిరీక్షిస్తున్న సుమంత్ కు అది అందనంత దూరంలో ఉంది. అయినా ఎప్పటికప్పుడు మంచి సినిమా ఇవ్వడానికే కృషి చేస్తున్నాడు.
ఎర్లియర్ గా ‘సుబ్రహ్మణ్యపురం, యన్టీఆర్ సిరీస్, ఇదం జగత్, కపటధారి’ లాంటి సినిమాలతో వరుస పరాజయాలు ఎదుర్కొన్న సుమంత్ .. ఇప్పుడు ‘అనగనగా ఒక రౌడీ’ సినిమాతో మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సారి ఖచ్చితంగా హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు. బిజుమీనన్ హీరోగా నటించిన ‘పడయోట్టం’ అనే మలయాళ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ కిది రీమేక్ వెర్షన్. మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్ గా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించారు మేకర్స్ .
వాల్తేరు శ్రీను అనే రౌడీ పాత్రలో సుమంత్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఒక రోడ్ మూవీ లాంటిది. ఇందులోని పాత్రలు .. ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణం చేస్తూ.. మంచి కామెడీ అందిస్తారు. అయితే సుమంత్ పాత్ర మాత్రం పక్కా సీరియస్ గా సాగుతుంది. కొందరు స్నేహితులు .. తన మిత్రుడికి యాక్సిడెంట్ చేసిన వాడి పనిపట్టడానికి ఒక రౌడీకి సుపారి ఇస్తారు. ఆ రౌడీ ఈ గ్యాంగ్ తో కలిసి.. వాడిని వెతుకుతూ బైలు దేరుతారు. ఈ నేపథ్యంలో సాగే కొన్ని సంఘటనలు .. నవ్వులు పంచుతాయి. ఫ్రెండ్స్ గా జబర్దస్త్ రామ్ ప్రసాద్, వైవా హర్షా, రఘు కారుమంచి, ధనరాజ్ తదితరులు నటించారు. మరి ఈ సినిమా అయినా సుమంత్ కెరీర్ ను మలుపు తిప్పుతుందేమో చూడాలి.
Shoot done and in post production! @iSumanth's #AnaganagaOkaRowdy 💥
Pls stay safe 😷💉 pic.twitter.com/AIGmbmv103
— BA Raju's Team (@baraju_SuperHit) May 3, 2021











