ప్రతిపక్ష నేతల్ని కక్షగట్టి అరెస్ట్ చేయించేందుకు వాడుతున్న యంత్రాంగాన్ని ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు వాడితే ఆక్సిజన్ అందక హిందూపురం ఆస్పత్రిలో 8 మంది, కర్నూలు ఆస్పత్రిలో ఆరుగురి ఊపిరి ఆగిపోయేది కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వం ఆధిపత్య రాజకీయాలపై చూపించే శ్రద్ధ, ప్రజలకు ఆక్సిజన్ అందించడంపై చూపాలన్నారు. అధికారులు, పోలీసులు, వలంటీర్లను వాడుకుని తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడంపై పెట్టిన శ్రద్ధ ప్రాణవాయువు అందించడంలో చూపితే బాగుండేదన్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఏదో ఒక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించాలని పదేపదే చేస్తున్న ప్రయత్నాలు,ఉత్తరాంధ్రలోని ఆస్పత్రులలో మెరుగైన సౌకర్యాల కల్పనపై పెట్టి ఉంటే విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ పేషెంట్లు చనిపోయి వుండేవారు కాదన్నారు. ప్రజలకు రక్షణగా ఉంటావని ఎన్నుకుంటే, ప్రతిపక్షంపై కక్ష తీర్చుకుంటున్నావు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిన్ను.. నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా క్షమించడు జగన్‌రెడ్డి అని లోకేష్ పేర్కొన్నారు. హిందూపూర్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.మృతుల కుటుంబాలను ఆదుకోవాలని లోకేష్ కోరారు.
ఏపీలో అక్వా కారిడార్.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్..
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...











