సినీ సెలబ్రిటీస్ పబ్లిక్ లోకి వెళితే… అభిమానుల తాకిడి, సెల్ఫీల బెడద తప్పదు. వారి పర్మిషన్ లేకుండానే సెల్ఫీలు తీసుకొని .. హీరోల అసహనానికి పరీక్ష పెడుతుంటారు. చాలా మంది స్టార్ హీరోలకు ఈ అనుభవం ఎదురైంది. అసలు విషయానికొస్తే .. తమిళ నాట ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరోలు పలువురు తమ ఏరియాలోని పోలింగ్ బూత్ కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు.
ఇప్పటివరకూ రజనీకాంత్, విక్రమ్, విజయ్, కీర్తి సురేశ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో తల అజిత్ కూడా భార్యా పిల్లలతో ఓటు వేయడానికి వచ్చి క్యూలో నిలుచున్నారు.
అజిత్ తో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పోటీ పడ్డారు. దాంతో అజిత్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఒక అభిమాని చేతిలో నుంచి ఫోన్ లాక్కొని వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. అలాగే.. తన చుట్టూ గుమిగూడిన అభిమానుల్ని వెనక్కి వెళ్ళిపోవాలని ఆదేశించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా?
#Thala #Ajith said SORRY to his fan! 😭❤️ Love you #ThalaAJITH 😍 Vaathi teaches us lesson #ValimaiUpdate #Valimai #TamilNaduElections2021 #TNElection #TNAssemblyElection2021 #Master #Vijay #Thalapathy #ThalapathyVijay #அஜித் #விஜய் pic.twitter.com/dZEyz0RIDy
— Prashanth Rangaswamy (@itsprashanthh) April 6, 2021