మనన దేశంలో సినీరంగంలో ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ పాల్కే. ఇప్పటి వరకూ 50 మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు 51వ పురస్కారం సూపర్ స్టార్ రజినీకాంత్ ను వరించడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. తమిళనాడు ఎన్నికల ముందు రజనీకాంత్ కు ఈ అవార్డ్ ను కేంద్రం ప్రకటించడం విశేషం. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జవడేకర్ తెలియచేశారు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు ను ఇప్పటి వరకూ హిందీ చిత్ర రంగం నుంచి 33 మంది అందుకోగా.. ఇతర భాషల నుంచి 18 మంది అందుకున్నారు.
రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రకటించడానికి ముందు తీవ్ర అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యం నుంచి కోలుకున్న అనంతరం పార్టీ ప్రకటన వెలువడుతుందని భావించిన వారికి షాకిస్తూ.. రజనీ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సినిమాల్లో నటిస్తున్న రజనీకాంత్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు వరించడంతో తమిళ సినీ పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు రజనీకాంత్ కు అభినందనలు తెలుపుతున్నారు.
Also Read :సూపర్ స్టార్ కటౌట్ తో అక్కినేని స్టార్