తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఓటు వేయడానికి సామాన్యులతో పాటు సినీ ప్రముఖులైన సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వ నటుడు, మక్కల్ నిధి మయ్యం చీఫ్ కమల్ హాసన్, అజిత్, సూర్య వంటి సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే,తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశాడు. దేశంలో పెట్రోల్ రేట్లు భగ్గుమంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధరల ధర రూ. 95 పైనే ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధరలు రూ 100 మార్క్ దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ… హీరో విజయ్ ఇలా సైకిల్ పై వచ్చినట్లు తెలుస్తోంది. అభిమానులు ఓటుహక్కును విధిగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
Must Read ;- అప్పుడు స్టాలిన్, ఇప్పుడు అల్లుడు : డీఎంకే నేతలపై ఐటీ గురి