తమిళ దళపతి విజయ్ .. ఇటీవల ‘మాస్టర్’ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో అంతగా మ్యాజిక్ చేయలేకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం కలెక్షన్స్ వరద పారించింది. దాదాపు రూ. 200కోట్ల వసూళ్ళను సాధించి.. అందరికీ షాకిచ్చింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి విజయ్ 65వ సినిమా మీదే ఉంది. నయనతార తో కోలమావు కోకిల అనే సూపర్ హిట్ మూవీ తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ .. విజయ్ 65వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయిన విజయ్ 65 సినిమా .. మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే ఖాయం అయింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్టేట్ విజయ్ అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. అందేంటంటే.. ఇందులో విలన్ గా అరవింద స్వామి నటించబోతున్నాడట.
ఆల్రెడీ ‘తనీ ఒరువన్’ లోనూ, దాని తెలుగు వెర్షన్ ధ్రువ లోనూ విలన్ గా నటించి… రెండు భాషల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు అరవింద స్వామి. ఇప్పుడు విజయ్ సినిమాలో కూడా ఓ బ్రిలియంట్ విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ మాస్టర్ లో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. సరిగ్గా అలాంటి పాత్రనే అరవింద స్వామి విజయ్ 65లో చేయనుండడం ఆసక్తిని రేపుతోంది. మరి హీరో విజయ్ తో విలన్ అరవింద స్వామి ఏ రేంజ్ లో తలపడతాడో చూడాలి.