దివంగత బాలీవుడ్ నటీమణి శ్రీదేవి ఫ్యామిలీకి, తమిళ తల అజిత్ కి మధ్య మంచి రిలేషన్స్ ఉన్న సంగతి తెలసిందే. అజిత్ తో సినిమా తీయాలని శ్రీదేవి అనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చకుండానే ఆమె మరణించారు. అందుకే శ్రీదేవి మరణానంతరం బోనీకపూర్ అజిత్ తో ‘పింక్’ బాలీవుడ్ మూవీని తమిళంలో ‘నేర్కొండ పారవై’గా నిర్మించి.. మంచి లాభాలు ఆర్జించారు. తెలుగులో పవన్ కళ్యాణ్ తో అదే సినిమాను వకీల్ సాబ్ గా తెలుగులో నిర్మించారు. దీంతో పాటు బోనీకపూర్ .. అదే దర్శకుడు హెచ్.వినోద్ దర్వకత్వంలో అజిత్ తోనే మళ్ళీ ‘వలిమై’ అనే సినిమా ను నిర్మిస్తున్నారు.
ఇప్పుడు మళ్ళీ అజిత్ తో మరో సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారు బోనీ కపూర్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని రివీల్ చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్ తో ‘మైదాన్’ సినిమాను నిర్మిస్తున్నారు బోనీ కపూర్. ఈ ఏడాది అక్టోబర్ 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక మే 1న అజిత్ నటిస్తున్న వలిమై సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని బోనీ కపూర్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అతి త్వరలో బోనీ అజిత్ తో తీయబోయే కొత్త సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు.
Also Read:థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సామాన్యుడు అజిత్