స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత.., మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీ కల్లోలం బాటపట్టింది. ఈ పరిస్ధితిలో ప్రజా ఉద్యమాలు.., నిరసనలు.., రోడ్డుపైకి వచ్చి నిర్వహించే ధర్నాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ క్రమంలో 28 రోజులుగా చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించి.. అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారన్నది ప్రజల నమ్ముతున్న వాస్తవం. ఈ నేపధ్యంలో రాజకీయాలకు అతీతంగా నేతలు.., ముఖ్యంగా సామాన్య ప్రజలు ముక్తకంఠంతో చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు… సంఘీభావం తెలుపుతున్నారు. ఈ క్రమంలో పోయిన నెల 30న మోతమోగిద్దాం అంటూ.. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యులు కావాలని కోరారు. దీంతో ప్రజలు స్వచ్ఛధంగా రోడ్డుపైకి వచ్చి.. శబ్ధం చేసి జగన్ రెడ్డి అకృత్యాలు.., అక్రమ అరెస్ట్ లపై యుద్ధం ప్రకటించారు.
ఆ తరువాత అక్టోబరు 2న సత్యమేవ జయతే కార్యక్రమంతో శాంతియుత నిరాహారా దీక్షకు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమం ద్వారా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములపై చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై నినదించారు. నిరాహార దీక్ష శిభిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కానీ.. జగన్ రెడ్డి ప్రభుత్వం కిమ్మనడం లేదు. కనికరం లేకుండా కేవలం కక్ష్యసాధించే ప్రధాన ఉద్దేశంగా.. ఇంకా కోర్టుల్లో ఆధారాలు లేని మరిన్ని తప్పుడు కేసులేన్నో వేయిస్తున్నారు. ఈ కేసుల్లో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్.., మంత్రులు అచ్చెన్న.., ఉమా.., నారాయణలపై అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారు.
ఎన్ని అక్రమ కేసులు కట్టి.. జైల్లో వేయాలని చూసినా.. ఎక్కడ తగ్గేదేలే అంటూ శాంతియుత నిరసనలతో తెలుగుదేశం ముందుకు సాగుతోంది. పార్టీ యువనేత నారా లోకేష్ కాంతితో కాంతితో క్రాంతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైసీపీ గుడ్డి ప్రభుత్వానికి కళ్లు తెరిపిద్దాం అంటూ ప్రపంచంలో ఉన్న తెలుగు జాతికి పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ.. రేపు రాత్రి (శనివారం) 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు అంటే 5 నిమిషాల పాటు ఇంట్లో లైట్లు ఆపి బయట టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేయాలని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం కోరారు. అలానే రోడ్డుపై ఉంటే వాహనం లైట్లును ఆపి..వేస్తూ నిరసన తెలపాలని కోరారు. లైట్ తో తెలిపే మద్దతును సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు సంఘీభావం తెలపాలన్నారు. మొన్న శబ్ధం.. నిన్న శాంతియుత నిరాహార దీక్ష.. నేడు వెలుగుతో ఏపీలోని జగన్ పాలనతో అన్ని రంగాలు ఏ విధంగా అంధకారంలో పడి ఉన్నాయో తెలిపేలా ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. శబ్ధం.. శాంతి.. కాంతి అంటూ చంద్రబాబు అరెస్ట్ కు సంఘీభావంగా ప్రపంచంలో ఉన్న 75 దేశాల నుంచి తెలుగు వారు మద్దతు తెలపడం ఒక రికార్డుగా చెప్పాలి.











