రాష్ట్రంలో అభివృద్ధిని చూపి.. అయ్యన్నను విమర్శించండి!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పాలన పగ్గాలు చేపట్టి, మూడేళ్లు కావస్తున్నా.. రాష్ట్రంలో మచ్చుకైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ నేత చింతకాయల విజయ్ విమర్శించారు. మూడు దశాబ్ధాల రాజకీయ చరిత్రలో నర్సీపట్నం నియోజకవర్గం సర్వోతోముఖాభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత అయ్యన్నపాత్రుడిదేనని విజయ్ గుర్తు చేశారు. ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది? ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేశారు? ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టారన్న అంశంపై స్థానిక ఎమ్మెల్యే గణేష్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కోస్తా టైగర్ అయ్యన్న పాత్రుడుని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక పోలీసులను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని విజయ్ మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి ఎందుకు జరగడంలేదో జగన్ రెడ్డిని నిలదీయలేని ఎమ్మెల్యే గణేశ్ .. అయ్యన్నపాత్రుడు విమర్శించడం సిగ్గుచేటని చింతకాయల విజయ్ ఎద్దేవా చేశారు.
Must Read:-అప్పు లేనిదే పూట గడవుదు..! మరో రూ. 27 వేల కోట్ల అప్పుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం!











