ఏపీ ప్రభుత్వం కొత్తగా మరో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.ఏపీలో రాబోయే మూడేళ్లలో 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు,వాటికి అవసరమైన నిధులు అప్పుల రూపంలో సమకూర్చుకునేందుకు వైద్య విద్య పరిశోధనా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కనీసం రూ.500 కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఏపీలో ఏర్పాటు చేయబోయే16 కొత్త మెడికల్ కాలేజీలకు రాబోయే మూడేళ్లలో సుమారు రూ.8000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఇంత మొత్తం భరించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదు.అందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మెడికల్ కాలేజీలకు ఇచ్చిన భూములను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలుq తీసుకునేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశారనే విమర్శలు వస్తున్నాయి.అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే వైద్య విద్య పరిశోధనా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది.
ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేసి..
ఏపీలో ఇప్పటికే 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు,అనుబంధ వైద్యశాలలు నడుస్తున్నాయి.వాటిల్లో కనీస సదుపాయలు లేక కరోనా రోగులు పిట్టల్లా రాలుతున్నారు.ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరచకుండా కొత్తగా 16 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేయడం వల్ల ఒరిగేదేమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓ మెడికల్ కళాశాల ఏర్పాటులో భాగంగా 16 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేస్తున్నట్టు చెబుతున్నారు.అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా కేవలం మెడికల్ కళాశాలలకు ఇచ్చిన భూములు తాకట్టు పెట్టి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మించాలని చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.కమీషన్లు దండుకునేందుకు మరో కుట్రకు తెర తీశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;-ఏపీలో సెంచరీ కొట్టిన పెట్రోల్.. ఏడాదిలో రూ.21 పైకి..!











