తెలుగు విద్యార్థులకు మనోధైర్యం నింపుతున్న చంద్రబాబు..
ఉక్రెయిన్ భీకర యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. వేలాది మంది భారతీయులు ఆ దేశంలో చిక్కుకున్నారు. అందుతో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. తిండి లేక, తాగేందు నీరులేక, తలదాచుకునేందకు వసతి లేక ఇబ్బంది పడుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ముందుకొచ్చారు. రెండు రోజులు ఉక్రెయిన్ విద్యార్థులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన సాయం అందించేందుకు ముందుకు రావాలని ఎన్ఆర్ఐలతో చంద్రబాబు మాట్లాడారు. విద్యార్థుల కోసం ఖర్చు చేసిన డబ్బులను పార్టీ నుంచి తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఉక్రెయిన్ లో స్థిరపడిన వారితో పాటు పోలండ్, హంగేరీలలో ఉన్న ఎన్ఆర్ఐలను చంద్రబాబు సంప్రదించారు. విద్యార్థులకు ఖర్చులకు డబ్బు, ఆహారం, హోటల్ ఖర్చులు అందించాలని వారిని కోరారు. ఇప్పుడు విద్యార్థులకు ఎన్ఆర్ఐలు చేసే ఖర్చును పార్టీ నుంచి వారికి తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు పిలుపుకు ముందుకొస్తున్న ఎన్ఆర్ఐలు
ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులను ఆదుకోవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపుకు ఉక్రెయిన్, పోలాండ్, హంగేరీ లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు స్పందించారు. విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి పోలండ్, హంగేరీలోకి వస్తే వారికి వసతి, ఆహారం అందించే ఏర్పాట్లు చేశామని చంద్రబాబు చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే విద్యార్థులను సురక్షితంగా బోర్డర్ లకు తరలిస్తామని ఉక్రెయిన్ లో స్థిరపడిన తెలుగు వారు దివ్యారాజ్, జగ్వార్ కుమార్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. రవాణకు అవసరమైన బస్సులు తాము సిద్థం చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల కష్టాలపై ఇప్పటికే కేంద్ర మంత్రి జైశంకర్ తో చంద్రబాబు స్వయంగా మాట్లాడానని విద్యార్థులకు చంద్రబాబు వివరించారు. పూర్తి సమాచారాన్ని కేంద్ర విదేశాంగ శాఖకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఇలా చంద్రబాబు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులకు భరోసా కల్పిస్తూ.. మనోధైర్యాన్ని నింపుతున్నారు.
Must Read:-ఉక్రెయిన్ తెలుగు విద్యార్థులకు సాయం చేయండి.. ఆ ఖర్చులను టీడీపీ భరిస్తోంది – చంద్రబాబు











