పాదయాత్ర పేరుతో ఏ2 విజయసాయి రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. అంతగా ఆయన పాదయాత్ర చేయాలనుకుంటే.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ.. ఢిల్లీలో చేయాలిగానీ.. వైజాగ్ చేయడమేంటని ప్రశ్నించారు. అసలు విశాఖ ఉక్కును ముంచిదే ఆ ఏ1, ఏ2 రెడ్లని, మళ్లీ వాళ్లే పాదయాత్ర చేస్తామనడం హాస్యాస్పదమని విమర్శించారు.
దమ్ముంటే.. వైసీపీ ఎంపీలు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. దోచుకోవడానికే ఏ1, ఏ2 లు విశాఖపై కన్నేశారని, అందమైన ఆ నగరాన్ని నాశనం చేసేవరకు విడిచి పెట్టరని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. కేసుల మాఫీ కోసం ఇప్పటికే ఏపీని తాకట్టు పెట్టేశారని, ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు మిగలవని విమర్శించారు. ఈ ఆర్థిక నేరగాళ్లు.. ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని కోరారు. చేతకాకపోతే పదవులకు రాజీనామా చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
Must Read ;- విజయసాయిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న కార్మిక సంఘాలు..