ఉన్న కథానాయికల అందచందాలనే ఊహించుకోలేక కుర్రాళ్లంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, కొత్త కథానాయికలు వచ్చేసి తెల్లవారు జామున కూడా నిద్రపట్టనీయకుండా చేస్తున్నారు. అదిగో అలా వచ్చిన అందాల నాయికనే ప్రియాంక అరుళ్ మోహన్. తమలపాకుకు తామరాకువంటి కళ్లను తగిలించినట్టుగా ఆమె చాలా నాజూకుగా కనిపిస్తుంది. సన్నజాజి మొగ్గలాంటి నాసిక .. దానిమ్మ మొగ్గవంటి పెదాలు .. పటిక బెల్లం వంటి చిన్ని గెడ్డం .. ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి.
ఇన్నేసి అందాలను పిండివడియాల మాదిరిగా ఆరబోసిన బ్రహ్మకు కుర్రాళ్ల బాధ ఎలా తెలుస్తుంది? అసలే ఆమె మోముపై నుంచి చూపులు తిప్పుకోలేకపోతుంటే, ఇప్పుడు నాజూకు నడుముభాగాన్ని బహిర్గతం చేస్తూ ఒక పోజు ఇచ్చింది. ‘అందాలలో అహో మహోదయం’ అంటూ తనని తాను మరిచిపోతున్న ఫీలింగ్ ను కలగజేస్తుంది. జున్నుతో చేసినట్టుగా కనిపిస్తున్న ఆమె సొగసులు కుర్రాళ్లు కళ్లు విప్పార్చుకుని మరీ చూస్తున్నారు. అందాన్ని ఆస్వాదించడానికి పడే అవస్థ .. కుర్రాళ్లకు ఒక అగ్ని పరీక్ష వంటిదే.
ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగులో చేసిన ‘శ్రీకారం‘ సినిమా, మహాశివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఈ నెల 19వ తేదీన ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేయనున్నారు. మిక్కీ జె. మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇక తమిళంలో ప్రియాంక అరుళ్ మోహన్ చేసిన ‘డాక్టర్’ సినిమా మార్చి 26వ తేదీన విడుదలకానుంది. శివకార్తికేయన్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ రెండు భాషల్లోనూ ఈ సుందరి హిట్లు కొడుతుందేమో చూడాలి.
Must Read ;- భర్తతో కలిసి ఇక చేయలేనంటున్న ప్రియాంక