తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కి కేంద్రం ఏ మాత్రం సహకరించడంలేదని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోడి కి బహిరంగ లేఖ రాశారు.మొత్తం 9 అంశాలను లేక లో ప్రస్తావించారు.మొదటి అంశంగా రాష్ట్రం విభజన పై ప్రధాని మోడి గతం లో చేసిన వ్యాఖ్యలను ఇప్పటికైనా వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాణ చెప్పాలని లేఖ లో పేర్కొన్నారు. రాష్ట్రం లో అధికారం లోఉన్న టీఆర్ఎస్ ప్రాజెక్టు ల పేరుతో కోట్ల రూపాయల ప్రజల సొమ్ము పక్కదారి పట్టించారని వాటి పై ఎందుకు నోరుమెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయమై హోం శాఖా మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెల్లినా ఇఫ్పటి వరకు స్పందన కరువైందని స్పష్టం చేశారు. ప్రత్యేకం గా కాళేశ్వర్ ప్రాజెక్ట్ లో జరిగి అవినీతి, అక్రమాలకు సంబధించిన పూర్తి వివరాలను కేంద్రం కు సమర్పించినట్లు వివరించారు..
ఎన్నికల సమయం లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంచ పసుపు బోర్డు ను ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియజేయాలని కోరారు. కృష్ణా జలాల అంశంతో జరుగుతున్న నష్టం పై ఊసేలేదని సూటిగా ప్రశ్నించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూసివేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. యాసంగి దాన్యం కొనుగోలు పై కేంద్రం వైఖరి ఏంటో చెప్పాలన్నారు.
అనాడు కాంగ్రెస్ పార్టీ హయాం లో ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం శంఖుస్థపన చేయాగా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ ఊసేదన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును తొలగించాన్ని తీవ్రంగ తప్పుపట్టారు. కేవలం కాంగ్రెస్ పై ఆయనకున్న అక్కసుతోనే తొలగిచారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.ఇక రామాయణం సర్క్యూట్లో భద్రాద్రికి చోటు కల్పించకపోవడం ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!
సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....











