పసుపు పండుగకు సర్వం సిద్ధం అయ్యింది.రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు టిడిపి శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయి. రెండేళ్ల తర్వాత భౌతికంగా నిర్వహిస్తున్న మహానాడు తమ సత్తా చాటేందుకు తెలుగు తమ్ముళ్ళు ఉవ్విళ్లూరుతున్నారు. నూతనత్వంతో భావజాలం చాటెలా ఈ కార్యక్రమం ఉండబోతోంది. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుకు తెలుగుదేశం అవసరాన్ని చాటెలా ఈ వేదికగా దిశా నిర్దేశం చేయనున్నారు.
నాలుగు దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ.. టిడిపి ప్రస్థానంలో మహానాడు కీలక భూమిక.ఏటా మూడు రోజులు పాటు నిర్వహించుకునే ఈ వేడుకను తెలుగుదేశం శ్రేణులు ఒక పండుగా జరుపుకుంటారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలతో ప్రతీ సంవత్సరం మే 27,28,29 తేదీల్లో మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీ. కాగా ఈ ఏడు మహానాడు కేవలం రెండు రోజులకు కుదించింది పార్టీ అధినాయకత్వం.
గత రెండేళ్లుగా కరోనా కారణంగా మహానాడు ఆన్లైన్ లోనే నిర్వహించుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఏడు పరిస్థితులు చక్కబడడంతో భౌతికంగా నిర్వహించాలని టిడిపి అధిష్టానం నిర్ణయించింది. అదే సమయంలో మహానాడుకు టిడిపి అధినేత చంద్రబాబు 16 కమిటీలను నియమించారు. మహానాడు నిర్వహణ, సమన్వయ కమిటీ బాధ్యతలు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అప్పగించారు. పార్టీ రాఅష్టర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బక్కయిని నర్సింహులు ఆహ్వాన కమిటీని పర్యవేక్షించనున్నారు. దీంతో మహనడు నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు ఆ పార్టీ శ్రేణులు.గత అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత తొలిసారి భౌతికంగా మహానాడు నిర్వహిస్తుండడంతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్ కనిపిస్తోంది. ఇక మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు భారీ బహిరంగ సభ ఉండేలా కార్యాచరణతో ఈ వేడుక జరగనుంది.
ప్రతినిధుల సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12 వేల మందికి ఆహ్వానాలు పంపగా హాజరు అంతకంటే ఎక్కువే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో రోజు ఇదే ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరగనుంది. గతంలో మహానాడులో బహిరంగ సభ నిర్వహణ ఉండేది కాదు,కానీ ఈ ఏడు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు రావడంతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వ పాలనా వైఫ్యల్యాలపై మరింత పదునుగా దాడి చేసే వ్యూహంతో మహానాడు సమావేశాలు ననిర్వహించేందుకు టిడిపి సన్నద్దమవుతోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ ముఖ చిత్రం మారుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సరికొత్త వ్యూహంతో అడుగులు వేయబోతున్నట్లే కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత విస్తరిస్తున్న తరుణంలో మహానాడు వేదికగా ఏపీలో మారిన రాజకీయ ప్రభావం ప్రతిఫలిస్తుందని టిడిపి శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి.
ప్రభుత్వ వైఫ్యల్యాలను అన్నీ వర్గాల్లోకి ఛేర్చేలా పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి మహానాడు నిర్వహణను ఒక అవకాశంగా తీసుకుని మరింత కదిలించాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ఇదే వ్యూహంతో వైసీపీ పాలన తీరుపై బలమైన దాడి జరపాలని నిర్ణయించింది. మూడేళ్ళ జగన్ పాలనలో ప్రజల పై పడిన భారాలు, ఆర్ధిక సంక్షోభం, కరెంట్ కోతలు, మహిళల పై ఆరాచకాలు వంటి అనేక అంశాలపై మహానాడులో తీర్మాణాలు ప్రవేశ పెట్టి చర్చించనున్నారు.సంక్షేమ మోసాలు, బాదుడే బాదుడు వంటి అంశాలపై మహానాడు వేదికగా ప్రధాన చర్చ చేపట్టనుంది టిడిపి. ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎత్తి చూపి, పేద ప్రజల్లోకి ఆ అంశాలను బలంగా తీసుకెళ్ళి వైసీపీని మరింత బలహీన పరచాలని తెలుగుదేశం భావిస్తోంది.
మొత్తం మీద రెండేళ్ల తర్వాత మహానాడు భౌతికంగా జరుగుతుండడంతో ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా మారింది, ఇక మహానాడుతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్ కనిపిస్తోంది.