2024 జూన్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఐతే అప్పటివరకూ పార్టీ కోసం పని చేసిన కీలక వ్యక్తులు ఒక్కొక్కరుగా తాడేపల్లి ఆఫీసుకు దూరమయ్యారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు అవినాష్ ఇరగవరపు అలియాస్ ట్రప్ అవినాష్.
గతంలో అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన అవినాష్ తర్వాత ఏపీకి వచ్చి వైఎస్సార్‌సీపీకి పని చేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిలో అవినాష్ ఒకరు. 2019-24 మధ్య వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించడంలో అవినాష్‌ది కీరోల్. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు జాతీయ మీడియాలో కవర్ అయ్యేలా చూసే బాధ్యత కూడా అవినాష్‌దే. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాలను ఎప్పటికప్పుడు జగన్‌కు అందించడంలో అవినాష్ కీలకంగా వ్యవహరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తాడని అంతా భావించినప్పటికీ..గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి బాగాలేదని అవినాష్ ముందే గ్రహించారు. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే..తన ఉద్యోగానికి రాజీనామా చేసిన అవినాష్ తాడేపల్లి ఆఫీసుకు రావడం మానేశారు. ఎన్నికలకు ముందు సరైన ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదని జగన్ అవినాష్‌పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇక, తెలంగాణలో BRSకు పని చేసేందుకు అవినాష్ ప్రయత్నాలు చేసినప్పటికీ..ఆ ప్రయత్నాలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గండి కొట్టినట్లు సమాచారం. జగన్ హయాంలో అవినాష్ చేసిన పనులపై ఉన్న అవగాహనతోనే KTR ఆయనను దూరం పెట్టారని తెలుస్తోంది. బిహార్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో అవినాష్ తన అదృష్టాన్ని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. గత కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న అవినాష్..ఇప్పుడు తిరిగి జగన్ క్యాంప్‌లో చేరడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం..జగన్ అవినాష్‌ను తిరిగి తన బృందంలో చేర్చుకున్నారని, అతనికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తిరిగి నెట్‌వర్క్‌ను పునర్‌నిర్మించే పనిని అతనికి అప్పగించారని తెలుస్తోంది











